చలికాలంలో కారును కండిషన్ లో ఉంచుకునే చిట్కాలు... 2 m ago
భారత శీతాకాలం చాల చోట్ల, ముఖ్యంగా ఉత్తర భారతదేశం, కొన్ని పర్వత ప్రాంతాలలో కఠినంగా ఉంటుంది. శీతాకాలం కోసం కారును ముందుగానే సిద్ధం చేసుకోవడం వల్ల, ఇది వాహనం యొక్క మొత్తం జీవితకాలాన్ని పెంచడంతో పాటు మరమ్మత్తు ఖర్చును కూడా తగ్గిస్తుంది. ఇటువంటి వాతావరణ పరిస్థితులు మీ కారుపై ప్రభావం చూపుతాయి. శీతాకాలం చలిని తట్టుకోవడానికి మీ కారు సిద్ధంగా ఉందో లేదో నిర్ధారించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలను చూద్దాం. కారు లైట్లను తనిఖీ చేయండి, బాటరీ మంచి పరిస్థితుల్లో ఉందో లేదో నిర్దారించండి. ఇంజినాయిల్, కూలంట్ ను చెక్ చేస్కోండి. క్లైమేట్ కంట్రోల్ అండ్ డిఫ్‌రోస్టర్ ను చెక్ చేసుకోవాలి.